రేపే కాపీ సినిమా రిలీజ్!!

By Staff

Amithab Bachan
రేపు సల్మాన్ ఖాన్,అమితాబ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గాడ్ తూస్సి గ్రేట్ హొ' చిత్రం ప్రపంచవాప్తంగా రిలీజ్ కానుంది. Shabbo Arts నిర్మించిన ఈ ఎంటర్ టైనింగ్ సినిమాకో ప్రత్యేకత ఉంది. అది మరేదో కాదు . 'బ్రూస్ ఆల్మైటీ' అనే హాలీవుడ్ చిత్రాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టడం.అయితే రచయిత,దర్శకుడు రుమీ జాఫ్రీ మాత్రం ఇవి వదంతులేనని కొట్టి పాడేస్తున్నాడు. సినిమాలో అమితాబ్ పాత్ర డ్రస్ ని బట్టి,ప్రోమోలను చూసి కథలు అంచనా వేస్తే ఎలా అని కోప్పడుతున్నాడు.

ఇప్పుడు 'కృష్ణార్జున, గది నెంబర్ 305 లో దేముడు' చిత్రాలకు మూలమైన జిమ్ క్యారి చిత్రం 'బ్రూస్ ఆల్మైటీ' తాజాగా మరో అవతారం ఎత్తబోతోంది.అయితే ఈ సారి హిందీలో 'గాడ్ తూస్సి గ్రేట్ హొ' పేరుతో ఫ్రీమేక్ అయ్యింది. సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా , అమితాబ్ ఈ చిత్రం ప్రథాన పాత్రలలో కనిపించనున్నారు. కథ ప్రకారం అరుణ్ ప్రజాపతి (సల్మాన్ ఖాన్) ఫెయిల్యూర్ టి.వి.యాంకర్. అతను మరో యాంకర్ అలియా(ప్రియాంక చోప్రా) ప్రేమలో ఉంటాడు. కాని ధైర్యంగా ఆ విషయం ఆమెకు చెప్పలేక పోతాడు. ఈ లోగా కొత్తగా వచ్చిన రాకి అనే మరో యాంకర్ ఆమెని గద్దలా తన్నుకు పోతాడు. దాంతో తట్టుకోలేక ఈ భాధలన్నిటికి దేముడిదే భాధ్యత అంటూ తిడతాడు.

అప్పుడో అద్బుతం జరుగుతుంది. దేముడు (అమితాబ్) రంగంలోకి దిగుతాడు. వారం రోజుల పాటు తన శక్తులు మన హీరోకి ఇవ్వటానకి రెడి అవుతాడు. ఇక అప్పటి నుంచి జరిగే తమాషా నవ్వులు పండిస్తుంది. ఒరిజనల్ సినిమాకి బాగా దగ్గరగా ఉన్న ఈ కథ తప్పని సరిగా విజయం సాథిస్తుందనే ఆశతో ఉన్నాడు దర్శకుడు రూమి జాఫ్రి. ఇక తెలుగులో నాగార్జున , తమిళంలో ప్రకాష్ రాజ్ ఈ దేముడు పాత్రని పోషించారు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక ఇప్పుడు అమితాబ్ వంతు వచ్చింది. మరి ఆయన యే రేంజిలో ఈ సినిమాని నిలబెడతాడో చూడాలంటున్నారు విశ్లేషకులు.

ఈ సినిమా హిట్టయితే ఇప్పటికే ఆపు అంతు లేకుండా వస్తున్న హాలీవుడ్ సినిమా కాపీలకి మరింత డిమాండ్ వస్తుంది.మనదైన సృజనాత్మకత చచ్చిపోతుందని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు.అయితే వారి మాట భాక్సాఫీసుకు వినపడుతుందా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X