అరణ్య, గాడ్జిల్లా vs కాంగ్ సినిమాలపై పైరసీ పంజా.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్లు లీక్.. మరీ ఇంత దారుణమా?
సినిమా ప్రపంచాన్ని గత కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ఇంకా విడువడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పైరసీ దెబ్బకు కొన్ని సినిమాలు భారీ స్థాయిలో నష్టపోతున్నాయి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా ప్రతి సినిమా విడుదలైన కొన్ని గంటలకే ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవల అరణ్య, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాల ప్రింట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పైరసీ భూతం
థియేటర్స్ లో ఆడియెన్స్ కు సరికొత్త ఫీల్ ను కలిగించి.. ఎంతో కొంత ప్రాఫిట్స్ అందుకోవాలని కష్టపడుతున్న దర్శక నిర్మాతలను పైరసీ భూతం ప్రతిసారి పంజా విసురుతోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలలో అలాగే పలు వెబ్ సైట్ లలో దర్శనమిస్తున్నాయి.

ఒక వైరస్ లా పాకుతోంది
తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ గత కొన్నేళ్లుగా సినిమా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ఎన్నిసార్లు కేసులు వేసినా కూడా వాటి నుంచి విముక్తి లభించడం లేదు. ఎంతోగానో అభివృద్ధి చెందిన టెక్నలిజి రంగంలో ఈ పైరసీ ఒక వైరస్ లా పాకుతోంది. ఒక సినిమాకు ఆగినా వెంటనే మరో సినిమా ప్రింట్లు లీక్ అవుతున్నాయి.

గాడ్జిల్లా vs కాంగ్.. అరణ్య లీక్
ఇక ఇటీవల అరణ్య సినిమాకు కూడా ఆ ఎఫెక్ట్ తప్పలేదు. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు భారిగానే ఉన్నాయి. నేడు సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఉదయం ప్రీమియర్స్ పడగానే మధ్యాహ్నం లోపు సినిమా HD ప్రింట్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ గాడ్జిల్లా vs కాంగ్ కూడా అన్ని భాషల్లో లీక్ అవ్వడం షాకింగ్ అనే చెప్పాలి.

గ్రామాలక వరకు వెళ్లింది
తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ ఎప్పటిలానే ఈ పెద్ద సినిమాలపై పంజా విసరగా మొన్నటివరకు టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు వెబ్ సైట్లకు వెళ్లి సినిమాలను డౌన్ లోడ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పైరసీ సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవడం గ్రామాల వరకు వెళ్ళింది. డౌన్ లోడ్ చేసుకోవడం ఈజీగా అయిపోవడం వల్ల సినిమాలకు భారీ నష్టాలను కలిగిస్తున్నాయి.

టెలిగ్రామ్ దెబ్బ
గూగుల్ యాప్ టెలిగ్రామ్ లలో కూడా కొత్త సినిమాల పైరసీ లింక్స్ యదేచ్చేగా షేర్ చేసుకుంటున్నారు. సినిమా ఏ వెబ్ సైట్ లో లీక్ చేసినా కూడా ఇప్పుడు టెలిగ్రామ్ పైరసీ సినిమాలకు మరింత బూస్ట్ ఇస్తున్నాయి. ఒక్క క్లిక్కుతో సినిమా డౌన్ లోడ్ అయ్యే టెక్నాలజీ వచ్చేసింది. గాడ్జిల్లా vs కాంగ్, అరణ్య సినిమాలకు సంబంధించిన ప్రింట్స్ కూడా ఇప్పుడు టెలిగ్రామ్ లో వైరల్ అయ్యాయి. మరి చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











