మహేశ్ - రాజమౌళి మూవీ ఫైనల్ టైటిల్ లీక్: ఈ పేరునే ఎందుకు పెడుతున్నారంటే!
గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి ఎంతో మంది దర్శకులు కారణం అని చెప్పాలి. కానీ, అందరి కంటే ముందే మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో వచ్చిన ఈ దర్శకధీరుడు.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. ఫలితంగా అప్పటి నుంచే ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతుంది.

హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్, రాజమౌళి ప్రాజెక్టు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను జక్కన్న తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్టును పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా తెలిపారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అలాగే, దీన్ని ఆగస్టు నుంచే మొదలుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా వార్తలే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి 'గోల్డ్' అనే పేరు ఖరారు చేసినట్లు ఓ న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఇది యూనివర్శల్ టైటిల్ కావడం వల్లే దీన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, తమ్మి రాజు ఎడిటర్‌గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











