పుష్ప మూవీ రిలీజ్‌పై సెన్సేషనల్ లీక్: ఆ విషయంలో వెనక్కి తగ్గిన నిర్మాతలు.. లాభాలు మొత్తం వాళ్లకేనట
బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే మార్కెట్‌ను విస్తరించుకున్నాడు.
ఈ క్రమంలోనే గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే తొలిసారి ఇండస్ట్రీ హిట్‌ను కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘పుష్పరాజ్'గా వస్తున్న అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఇలా
గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'పుష్ప' మూవీ రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడం.. డీ గ్లామర్‌గా కనిపించడం.. చిత్తూరు యాసలో మాట్లాడడంతో పాటు రియల్ స్టంట్స్ చేస్తున్నాడట.

ఏకంగా రెండు భాగాలు... షూటింగ్‌పై
ఏకంగా ఐదు భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్ కోసం దాదాపు 40 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు బ్యాలెన్స్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు.

రిలీజ్‌కు ముందే ఆల్‌టైం రికార్డులు
కొద్ది రోజుల క్రితం పుష్ఫ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి ఇటీవలే 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి', 'సామీ సామీ' పాటలను వదలగా ఇవి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అందుకుని సత్తా చాటుకున్నాయి.

హిందీలో రిలీజ్ లేదని ప్రచారాలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అప్‌డేట్లను కూడా అన్ని భాషల్లోనూ ఇచ్చింది. అయితే, ఈ మధ్య ఇది హిందీలో విడుదల కావడం లేదంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అయింది.

అందులో కూడా రాబోతున్న పుష్ప
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప మూవీ హిందీలో కూడా రాబోతుంది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ నాలుగో పాటకు సంబంధించిన పోస్టర్‌ను వదిలిన సమయంలో క్లారిటీ ఇచ్చింది. గతంలో మాదిరిగానే ఈ పాటను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ కూడా రాబోతుందని అధికారికంగా వెల్లడించారు.
Recommended Video

వాళ్లే విడుదల చేస్తున్నారని టాక్
'పుష్ప' మూవీని హిందీలో గోల్డ్‌మైన్ టెలీఫిల్మ్స్ సంస్థ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సదరు సంస్థతో చర్చలు జరిపిందట. ఈ క్రమంలోనే హిందీ థియేట్రికల్ లాభాల్లో ఎక్కువ శాతం ఆ సంస్థకు ఇచ్చేందుకు మైత్రీ సంస్థ ముందుకొచ్చిందట. అలాగే, విడుదల ఖర్చులను కూడా భరించబోతుందట. అందుకే దీనికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











