వరుణ్ తేజ చిత్రం టైటిల్ : 'గొల్లభామ' కాదు మరి...?

By Srikanya

హైదరాబాద్ : నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ లాంచింగ్ చిత్రం గొల్లభామ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కాకుండా... ముకుందా ని నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో ప్రక్కన చేసేస్తున్నారు. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలా చిత్రం ని దసరాకు టార్గెట్ చేయటంతో ... నాగబాబు కొడుకు సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెలఖరుకు చిత్రం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం.

వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఠాగూర్‌ మధు సమర్పిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Gollabhama or Mukunda for Varun Tej's film ?

సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. మా సినిమాకు పలు టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. అయినా మేం ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. త్వరలో ప్రకటిస్తాం'' అని అన్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X