శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం టైటిల్ ఇదేనా?
తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అయితేనే బెటరని నాగబాబు బలంగా నమ్ముతున్నాడని, వరుణ్ తేజ కోసం మంచి కథ రెడీ చేయమని అతన్ని పురమాయించాడని టాక్. గీతా ఆర్ట్స్ బేనర్ పై ఈచిత్రం రూపొందే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ నటనతో పాటు, సినిమాకుల సంబంధించిన విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.
వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
మరో ప్రక్క పవన్ కళ్యాణ్ పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో, గోదావరి యాసతో కూడిన కథను రెడీ చేసినట్లు సమాచారం. ఈ వారంలోనే దాన్ని ఆయనకు నేరేట్ చేస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాలను 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజైన తర్వాత పవన్ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












