రామ్ చరణ్-కొరటాల శివ చిత్రం కథకి బేస్
బండ్ల గణేష్ మాట్లాడుతూ..రామ్ చరణ్ తో ఓ సెన్సేషనల్ మూవి తియ్యాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. కొరటాల శివ అద్బుతమైన కథ చెప్పారు. హై టెక్నికల్ వేల్యూస్ తో నిర్మించే ఈ చిత్రం మా బేనర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. జూలై లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏకథాటిగా షూటింగ్ జరుపుతాము అన్నారు.
రామ్ చరణ్ తో పాటు మరో 50 మంది ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సమర్ఫణ..శివబాబండ్ల, నిర్మాత బండ్ల గణేష్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం కొరటాల శివ.
మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












