కల్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నాడట.. నందమూరి ఫ్యాన్స్ రెడీగా ఉండండి

నందమూరి హీరోల్లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కల్యాణ్ రామ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభంలో 'అతనొక్కడే' వంటి సక్సెస్ తర్వాత చాలా కాలం పాటు సరైన హిట్ పడక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, నిర్మాతగానూ వ్యవహరించాడు. చాలా కాలం పాటు ఒకే రకమైన సినిమాలు చేస్తూ హిట్‌ను సాధించలేకపోయాడు. అయితే, 'పటాస్' నుంచి అతడిలో చాలా మార్పులు వచ్చాయి. కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే మూస కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి కొత్త తరహా ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాడు. ఇలా సినిమా సినిమాకు తనతో పాటు కథల్లోనూ వేరియేషన్స్ చూపించి సక్సెస్ అవుతున్నాడు. కొద్దిరోజుల క్రితం వచ్చిన '118' ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది.

Good News For Nandamuri Fans

ఈ ఉత్సాహంతోనే కల్యాణ్ రామ్.. 'శతమానం భవతి' ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' అనే సినిమా చేస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక, దీని తర్వాత కల్యాణ్ రామ్.. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కొద్దిరోజులు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌గా తెరకెక్కించబోతున్నారని ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో కల్యాణ్ రామ్‌లోని కొత్త యాంగిల్ చూపించబోతున్నాడట సంపత్. ఇది కన్ఫార్మ్ అయితే నందమూరి ఫ్యాన్స్ నవ్వుకోడానికి రెడీగా ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X