twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త: ఎన్టీఆర్ తండ్రిగా బాలకృష్ణ.. బడా డైరెక్టర్ ప్లాన్.!

    By Manoj
    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభావం చూపిస్తున్న కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం నందమూరి తారక రామారావు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత పలువురు ఈ కుటుంబం నుంచి సినిమాల్లోకి ప్రవేశించారు. వారిలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. వీళ్లు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ - బాలయ్య కలిసి ఓ సినిమా చేయబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే....

     ఈ ఇద్దరూ ఇలా సెట్ అయిపోయారు

    ఈ ఇద్దరూ ఇలా సెట్ అయిపోయారు

    ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్ల తర్వాత ఈ సినిమా రాబోతుంది. దీన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తారక్ మాత్రం రామ్ చరణ్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అతడు కొమరం భీంగా కనిపించబోతున్నాడు.

    జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో మరోసారి

    జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో మరోసారి

    ప్రస్తుతం RRR షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్.. దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్న దానిపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటించబోతున్నాడట. గతంలో వీళ్ల కాంబోలో ‘అరవింద సమేత' అనే మూవీ వచ్చింది.

    అదే సెంటిమెంట్.. అదిరిపోయిందిగా

    అదే సెంటిమెంట్.. అదిరిపోయిందిగా

    త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘అయిననూ పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌కు ‘అ' సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అందుకే మరోసారి దానిని ఫాలో అయ్యారని అంటున్నారు. హారిక హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించే ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. థమన్ సంగీతం అందించనున్నాడు.

    నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త

    నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త

    తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడట. అది కూడా ఎన్టీఆర్‌కు తండ్రిగా చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

    బాలయ్య - కల్యాణ్ రామ్ కూడా

    బాలయ్య - కల్యాణ్ రామ్ కూడా

    గత ఏడాది ప్రారంభంలో బాలయ్య.. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘యన్.టి.ఆర్' అనే మూవీ చేశారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో బాలయ్య.. ఎన్టీఆర్ పాత్రను పోషించగా.. కల్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా హిట్ కాకున్నా వీళ్లిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు బాగా పేలాయి.

    Recommended Video

    Ruler Movie Success Meet | Balakrishna | KS Ravi Kumar
    ఎన్టీఆర్ తండ్రిగా మెగా హీరో

    ఎన్టీఆర్ తండ్రిగా మెగా హీరో

    ఇక, గతంలో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తారక్‌కు తండ్రిగా మెగా కాంపౌండ్‌కు చెందిన నాగబాబును తీసుకున్నారు. ఇందులో ఆయన కనిపించేది కొద్ది సేపే అయినా మంచి స్పందన వచ్చింది.

    English summary
    Tollywood Young Hero Jr Ntr Busy with RRR Shooting. This movie Directed by SS Rajamouli. in This movie Mega power star Ram charan also Working. After This Ntr Will Work With Trivikram Srinivas Again. In This Movie Balakrishna Plays Key Role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X