నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బోయపాటి డిసైడ్! ఇకపై అంతా..
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు షికారు చేస్తుండటంతో ఈ మూవీ షూటింగ్ పట్ల జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఇక ఆలస్యం చేయొద్దని బోయపాటి డిసైడ్ అయ్యారట. వివరాల్లోకి పోతే..

బాలయ్యతో ఆట.. రెగ్యులర్ షూటింగ్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాను ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్, ఇతర నటీనటులు ఫైనల్ కాకపోవడంతో రెగ్యులర్ షూటింగ్ కాస్త డిలే అవుతూ వచ్చింది.

బోయపాటి స్కెచ్.. ఇకపై అంతా
బాలయ్య- బోయపాటిది సక్సెస్‌ఫుల్ కాంబో కావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంతలో ఫినిష్ చేస్తారు అనే దానిపై బాలకృష్ణ అభిమానులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టేసి షూటింగ్ అంతా చక చకా ఫినిష్ చేసేలా బోయపాటి స్కెచ్ రెడీ చేసినట్లుగా తాజా సమాచారం.

బలమైన కథ.. బాలయ్య అభిమానుల ఆశలు
గతంలో బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ' ఆ తర్వాత ‘లెజెండ్' సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. కాబట్టి ఈసారి ఆ రెండు సినిమాలకు మించిన భారీ బ్లాక్‌బస్టర్ మూవీ రాబోతుందని నందమూరి అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే బోయపాటి శ్రీను బలమైన కథ ఎంచుకున్నట్లు టాక్.

బాలయ్యతో రొమాన్స్.. హీరోయిన్ ఎవరంటే
ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న బోయపాటి హీరోయిన్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని టాక్ నడించింది. ఎందరో హీరోయిన్లను సంప్రదించినప్పటికీ పలు కారణాల వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారని వార్తలు విన్నాం. అందులో ప్రధానంగా కీర్తి సురేష్ పేరు వినిపించింది. అయితే చివరకు బాలకృష్ణ సరసన నటించేందుకు కేథరిన్ త్రెసా ఓకే చెప్పిందని తెలిసింది.

రోజాతో బాలయ్య సమరం
ఇక ఈ సినిమాలో బాలయ్యతో రోజా సమరం అనేది స్పెషల్ ఎపిసోడ్ కానుందని టాక్ నడుస్తోంది. బోయపాటి మార్క్‌తో ఈ ఇద్దరి మధ్య సాగే హోరాహోరీ సన్నివేశాలు నందమూరి అభిమానులను కనువిందు చేయనున్నాయని అంటున్నారు. బాలయ్యను ఢీ కొట్టేందుకు రోజా రెడీ అవుతోందని సమాచారం.
Recommended Video

విలన్.. బోయపాటి నిర్ణయం
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను తమన్ సంగీతం అందించనున్నాడు. తాజా సమాచారం మేరకు కమెడియన్ సునీల్‌ను కూడా విలన్ పాత్రకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారట దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











