For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే.. ముగ్గురూ ఒకేసారి వస్తున్నారు.!

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి తారక రామారావు తర్వాత ఈ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే, వారిలో కొందరు మాత్రమే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ తర్వాతి తరంలో అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదే తరహా క్రేజ్ సంపాదించాడు. వీరిద్దరి తర్వాత కల్యాణ్ రామ్ ఒక్కడే హీరోగా నిలదొక్కుకున్నాడు. తాజాగా వీళ్ల ముగ్గురి గురించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త..?

  ఫుల్ బిజీగా బాబాయ్ - అబ్బాయిలు

  ఫుల్ బిజీగా బాబాయ్ - అబ్బాయిలు

  నందమూరి హీరోలు స్పీడు చూపిస్తున్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తలో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ముగ్గురూ పేరొందిన దర్శకులతో పని చేస్తుండడంతో ఆయా సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూడు సినిమాలు నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  ‘రూలర్’ అంటూ వస్తున్న బాలయ్య

  ‘రూలర్’ అంటూ వస్తున్న బాలయ్య

  ‘జై సింహా' వంటి హిట్ సినిమా తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రం ‘రూలర్'. దీన్ని సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

  మంచివాడిగా మారిన కల్యాణ్ రామ్

  మంచివాడిగా మారిన కల్యాణ్ రామ్

  కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి కొత్త తరహా ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. అతడు ప్రస్తుతం ‘శతమానం భవతి' ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా' అనే సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  కొమరం భీంగా జూనియర్

  కొమరం భీంగా జూనియర్

  ఇక, జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR' అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 20, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Cine Box : RGV Shared Hilarious Picture Of Pawan Kalyan And Nara Lokesh, Have A Look !
  ఒకే నెలలో ముగ్గురు

  ఒకే నెలలో ముగ్గురు

  ఈ ముగ్గురు హీరోలు తలో సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. వీరిలో బాలయ్య సినిమా డిసెంబర్ 20, కల్యాణ్ సినిమా సంక్రాతికి రానుంది. డిసెంబర్‌లో బాలయ్య సినిమా విడుదలవుతుండడంతో పాటు కల్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ కూడా వస్తోందట. అలాగే, ‘RRR'లో ఎన్టీఆర్‌ లుక్‌ను సైతం అదే నెలలో విడుదల చేయబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

  English summary
  Nandamuri Heros Full Busy Now. Jr Ntr Working With Rajmouli For RRR. In This FIlm Ram Charan Also Play Lead Role. Another Nandamuri Hero Balakrishna Working With Ks Ravikumar Under C Kalyan Production. Kalyan Ram Doing Film With Sathish The Nme Of Enta Manchivadavura.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X