twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: ‘గోపాల గోపాల’ సాంగు వెనక రహస్యం...?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘గోపాల గోపాల' చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. సినిమాలో ఉన్నవి మూడు పాటలే అయినా రెస్పాన్స్ మాత్రం బావుంది. అన్ని సిచ్యువేషన్ సాంగులే కాబట్టి సినిమాకు ప్లస్సవుతుందని భావిస్తున్నారు. అయితే సినిమాలోని ఓ సాంగుకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

    ఆడియో విడుదలకు మూడు రోజుల ముందుగానే....‘భజే భజే' సాంగ్ విడుదలై సంగతి తెలిసిందే. ఈ సాంగు గురించి ఓ గాసిప్ వినిపిస్తోంది. వాస్తవానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ‘టెంపర్' కోసం ఈ ట్యూన్ చేసాడట. అయితే ఆ ట్యూన్ ఆ సినిమాకు సూట్ కాక పోవడంతో వాడలేదట. ఆ ట్యూన్లో కొన్ని మార్పులు చేసి, కొత్తవి మేళవించి భక్తి రసానికి సింక్ అయ్యేలా ‘గోపాల గోపాల'లో సెట్ చేసారట.

    https://www.facebook.com/TeluguFilmibeat

    'Gopala Gopala' Song Secret

    'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దొంగ స్వామీగా చేసిన పోసాని తనదైన స్పెషల్ డైలాగు డెలవరితో అదరకొట్టాడని, త్వరలో ఆయన డైలాగుతో టీజర్ వదిలే అవకాసం ఉందని అంటున్నారు.

    మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

    English summary
    According to the scoop, the music director Anup Rubens composed this tune for the film Temper starring young tiger Jr NTR and helmed by crazy director Puri Jagannadh. However, it didn’t fit into the scheme of things and so the song got shifted to Gopala Gopala. Of course, even the lyric has been changed and flavor also modified accordingly, as per sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X