For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ‘గోపాల గోపాల’ కి ఇంకో తలనొప్పి(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'గోపాల గోపాల' చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్‌' చిత్రానికి ఇది రీమేక్‌. ఇందులో పవన్‌కల్యాణ్‌ మోడ్రన్‌ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు. అసలే రకరకాల కారణాలతో షూటింగ్ వాయిదా పడటంతో తొలీ నుంచి అనుకున్నట్టుగా సంక్రాంతికి ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయగలమా అనే టెన్షన్ లో యూనిట్ ఉన్నారు. ఇదిలా ఉంటే మధ్యలో ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అంటూ ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియో మీరూ చూడండి..

  ఇప్పుడు ఈ వీడియో విడుదల అయ్యి..సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పుణ్యమా అని జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు మళ్లీ ఫస్ట్ లుక్ అని విడుదల చేస్తే...అంత అటెన్షన్ ఉంటుందా కొంత వరకూ తగ్గుతుంది అని యూనిట్ ఆలోచనలో పడుతున్నారు.

  సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్‌ను జరుపుకున్న ఈ చిత్రం కోసం ఇటీవల వెంకటేష్‌, పవన్‌ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించారు.

  చిత్రం విషయానికి వస్తే..

  దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.

  Gopala Gopala Telugu Movie Motion Poster

  బిజినెస్ విషయానికి వస్తే...

  పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బ్రద్దలు కొడుతూంటాయి. గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' కి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

  అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గోపాల గోపాల' నైజాం రైట్స్ ని 14 కోట్లకు అమ్ముడైంది. ప్రశాంత్ ఫిల్మ్ వారు ఈ ఏరియా పంపిణీ హక్కులు పొందారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం థియోటర్ వరకూ...55 కోట్లు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాత సురేష్ బాబు, శరద్ మరారా లు దాదాపు 20 కోట్లు వరకూ టేబుల్ ప్రాఫెట్ ని లబ్ది పొందుతున్నారని టాక్. ముఖ్యంగా పవన్ గత చిత్రం అత్తారింటికి దారేది కన్నా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ కావటం కలిసి వచ్చే అంశం.

  అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan's upcoming and most anticipated Multi Starrer Movie Gopala Gopala Motion Poster and First Look, Co-starring Venkatesh, Shreya, Mithun Chakraborthy, Madhu Shalini, Vennela Kishore, Posani Krishna Murali. Directed by Dolly and Produced by Suresh Babu and Sharat Marar, Music Composed by Anoop Rubens
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X