వంశి కొత్త చిత్రం స్టోరీ లైన్ !?
అనుమానస్పదం అనంతరం ప్రముఖ దర్శకుడు వంశి దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ గోపి..గోపిక..గోదావరి. కమిలిని ముఖర్జీ, వేణు ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రం జూలై పదిన రిలీజ్ కానుంది. మొదట ఈ నెల ఇరవై ఆరున రిలీజ్ ప్లాన్ చేసినా పోస్ట్ ప్రొడక్షన్లో లేటు వల్ల విడుదల తేదీ మారుస్తున్నారని సమాచారం. ఈ చిత్రం కథపై బయిట రకరకాల కథనాలు వినపడుతున్నాయి. వాటి ప్రకారం కమిలినీ ముఖర్జీ గోదావరిలో మొబైల్ హాస్పటిల్ ని నడుపుతూంటుంది. అక్కడ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి వచ్చిన వేణుని ఆమె చికిత్స చేసి వైద్యం చేస్తుంది. తెలుస్తోంది. అయితే అతను ఈ ప్రమాదంలో తన జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉంటాడు. ఆ తర్వాత అతను కమిలినీతో ప్రేమలో పడతాడు. అయితే అంతకు ముందే అతనికి సిటీలో ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ రెండింటి మధ్యా ఏం జరుగుతుందనేది కథ అంటునన్నారు. ఇక ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందిస్తున్నాడు. వల్లూరి పల్లి రమేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











