ప్రభాస్ కు గోపీచంద్ ఓకే
తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ప్రస్తుతం కమల్ హాసన్, వెంకటేష్ నటించిన 'ఈనాడు' చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ తాను మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా వున్నానని అంటున్నాడు. అంతే కాకుండా మల్టీస్టారర్ చిత్రాల వల్ల సినీపరిశ్రమకు లాభాలపంట పండుతుందని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా తనకు ఎప్పటినుంచో ప్రభాస్ తో కలిసి నటించాలని వుందని తన కోర్కెను వెలిబుచ్చాడు. 'వర్షం' చిత్రంలో తాను విలన్ గా నటించగా, ప్రభాస్ హీరోగా నటించాడని ఎవరైనా మంచి కథతో వస్తే ఇద్దరం కలసి ఓ సినిమా చెయ్యాలనుకున్నట్టు చెప్పాడు. మరి గోపీచంద్ ఆఫర్ కి ప్రభాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
కానీ హీరోల మధ్య బేషజాలు తగ్గి మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకొంటే అది సినీపరిశ్రమకు ఎంతో మేలని, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











