డైరక్టర్ కి కాజల్, హీరోకి అనుష్క కావాలంటూ పట్టు
బి.గోపాల్, గోపీచంద్ ల కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా అనుష్క కావాలని గోపీచంద్ పట్టుపడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ ఈ చిత్రం నిర్మాత నల్లమలుపు బుజ్జి గతంలో అనుష్క, గోపీచంద్ కాంబినేషన్లో లక్ష్యం చిత్రాన్ని రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. దాంతో బుజ్జి కూడా అటువైపే మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. అయితే దర్శకుడు బి గోపాల్ మాత్రం కాజల్ హీరోయిన్ గా పెడితే కథకు న్యాయం చేసినట్లుంటుందని వాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంకి రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ చేస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుంటే మస్కా చిత్రానికి కథ అందించిన సూర్య ఈ చిత్రానికి కథ ఇస్తున్నారు. జూన్ ఏడు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక ఇప్పటికీ మాత్రం హీరోయిన్ అనుష్క, కాజల్ అనేది డిసైడ్ కాలేదు. ఇంతకీ ఎవరు బావుంటారు అంటారు.
కాజల్ అనుష్క గోపీచంద్ గోలీమార్ పూరీ జగన్నాధ్ వెంకటేష్ బి గోపాల్ kajal anushka gopichand golimaar puri jagannath b gopal


Click it and Unblock the Notifications