హాట్ న్యూస్ :గోపీచంద్‌ ,యేలేటి చిత్రం టైటిల్ మార్పు

By Srikanya

హైదరాబాద్: గోపీచంద్‌, తాప్సీ జంటగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'జాక్‌పాట్‌' అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి 'సాహసం ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. చిత్తరం పూర్తిగా ఎండ్వెంచర్స్ తో నడవటంతో ఈ టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తయారవుతోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మైంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామోజీ ఫిల్మ్‌సిటీ, లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

నిధుల అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్‌ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని అలరిస్తాయి. లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ ఎటిఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా కనపించనున్నాడని సమాచారం. మెకన్నాస్ గోల్డ్ తరహా కథాంసంతో గోపీచంద్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలవనుందని చెప్తున్నారు.

చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ- ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఓ దేశం నుండి ఓ సామాన్యుడు సాహసోపేతంగా నిధిని ఎలా సాధించాడన్నదే ఈ చిత్రం కధాంశమని, అడ్వెంచరస్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని జోర్డాన్, రాజస్థాన్, లడఖ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని, ఈ కాలానికి తగ్గట్టుగా 'ట్రెజర్ హంట్' కథను సరికొత్తగా చిత్రంలో చూపిస్తామని, తాను ఇదివరకుచేసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X