గోపీచంద్ సినిమా ఎన్టీఆర్ కమిటయ్యాడా?

By Srikanya

గోపీచంద్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం చేయటానికి సింహా ప్రారంభం కావటానికి ముందు చాలా కాలం సిట్టింగ్స్ నడిచాయి. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకొచ్చారు. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత కథ నచ్చలేదంటూ గోపీచంద్ రిజెక్టు చేయటం, ఆ తర్వాత ప్రభాస్ కి చెప్పటం, ఆఖరున బాలయ్యకు చెప్పటం, ఓకే కావటం, సూపర్ హిట్ కావటం అంతా స్పీడుగా జరిగిపోయాయి. అయితే కె.ఎస్.రామారావు దగ్గర చిత్రం చేస్తానని మాట ఇచ్చి ఎడ్వాన్స్ తీసుకున్న బోయపాటి ఆ మాటను నిలబెట్టుకోవటానికి రెడీ అయ్యారు. అయితే గోపీచంద్ తో చిత్రం కాకుండా ఎన్టీఆర్ తో కావటం విశేషం. దాంతో గోపీచంద్ చేయాల్సిన స్లాట్ లోకి ఎన్టీఆర్ వచ్చినట్లయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు కథా చర్చలు ప్రారంభమయ్యాయి. భద్ర, తులసి, సింహా తర్వాత ఎలాంటి హిట్ కొడతాడో అని అంతా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X