25 లక్షలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజు
బలుపు విజయంతో గోపీచంద్ మలినేనికి వరస ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. బండ్లగణేష్ కూడా సంప్రదించాడని తెలుస్తోంది. అయితే హీరో డేట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వారి దగ్గరే ఓకే చేయాలనే ఆలోచనతో గోపీచంద్ ఉన్నట్లు చెప్తున్నారు. దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్ కావటంతో ఏ హీరో డేట్స్ అయినా తెచ్చి,తనకు కావాల్సిన బడ్జెట్ ఇస్తాడనే నమ్మకంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
రవితేజ నటించిన 'బలుపు' చిత్రం క్రితం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 15 కోట్ల వరకూ కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోందని చెప్తున్నారు. కలెక్షన్స్ స్టడిగా ఉండటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు.
రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు. 'బలుపు'చిత్రం తొలి రోజు టోటల్‌గా దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.3.9 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కచ్చితమైన లెక్కల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రవితేజ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కాస్త భయపడుతూనే సినిమాను కొన్న బయ్యర్లు తాజా ఫలితాలతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












