జూలై లో హీరో గోపీచంద్ వివాహం?
స్టార్ హీరో గోపీచంద్ కుటుంబ సభ్యులు ఎరేంజ్ చేసిన వివాహానికే సమ్మతించారని సమాచారం. జూలై లో ఈ వివాహం గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది. ఆ మధ్య అనూష్కను వివాహం చేసుకుంటాడని వచ్చిన రూమర్స్ కు ఈ వార్త చెక్ చెప్తుందని అతని శ్రేయాభిలాషులు భావిస్తున్నారు. అనూష్క, గోపీచంద్ కలిసి తిరుగుతున్నారని, త్వరలోనే వారి వివాహం జరిగే అవకాశం ఉందని అప్పట్లో వినపడింది. అందుకోసమే గోపిచంద్ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారి సినిమా సైతం వదులుకున్నాడని తెలిసింది. అనూష్కను వారు హీరోయిన్ గా తీసుకోవటంతో గోపీచంద్ తప్పుకున్నాడని చెప్పుకున్నాడు. అది కూడా అతని కుటుంబ సబ్యులు ప్రెషర్ పై జరిగిందని, అందుకే పెళ్ళి చేసుకుంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావని భావిస్తున్నాడు. ఇక గోపీచంద్ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో గోలీమార్ చిత్రంలో చేస్తున్నారు. ఇందులో గోపిచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టు గా కనిపిస్తారు. దయానాయక్ జీవితం ఆధారంగా ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసారు. అతని సరసన ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











