Don't Miss!
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Sports
ఆయన వల్లే ఫైనల్‌కు చేరాం.. నా సత్తా మొత్తం బయటికి తీసాడు: హార్దిక్ పాండ్యా
- Finance
టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.16 లక్షల కోట్లు జంప్
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేశ్ - రాజమౌళి మూవీలో విలన్‌గా తెలుగు హీరో: 20 ఏళ్ల తర్వాత మరోసారి ఇద్దరి మధ్య వార్
తెలుగు సిని పరిశ్రమకు సంబంధించి.. చాలా మంది కొన్ని కాంబినేషన్ల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమకు నచ్చిన హీరో.. ఫలానా దర్శకుడితో సినిమా చేయాలని ఆశ పడుతుంటారు. అలా ఎంతో కాలంగా సినీ ప్రియులంతా కోరుకుంటోన్న కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కలయిక ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడో సినిమా చేయాల్సి ఉన్నా.. ఎందుకనో వర్కౌట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైన నిరీక్షణకు తెరదించుతూ వీళ్లిద్దరూ ఓ సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రాజమౌళి అలా.. మహేశ్ బాబు ఇలా
కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు, రాజమౌళి ఇప్పుడు RRRతో రెడీగా ఉన్నాడు. ఈ భారీ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ రేంజ్‌తో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

ఇద్దరి కాంబినేషన్లో భారీ ప్రాజెక్టు
తనదైన శైలి చిత్రాలతో తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. ఈయనతో సినిమాలు చేయాలని హీరోలందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ టాప్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నట్లు వెల్లడించాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారని కూడా పేర్కొన్నాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కథ బాధ్యతలు ఆయన చేతుల్లోనే
టాలీవుడ్లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేస్తున్నారని అంటున్నారు. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఆయన చాలా రోజులుగా ఈ మూవీ కథపై వర్క్ చేస్తున్నారని స్వయంగా చెప్పారు.
గౌతమ్ పుట్టినప్పుడే ఆ సమస్య.. మాకు డబ్బుంది వాళ్లకు లేదు కదా: బాలయ్య షోలో మహేశ్ ఎమోషనల్

అలాంటి స్టోరీ... ఇలాంటి కథ అని
క్రేజీ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని.. రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. అడ్వెంచర్ కథతో తెరకెక్కుతుందని రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

మరింత ఆలస్యం కానున్న సినిమా
వాస్తవానికి మహేశ్ బాబు.. రాజమౌళి కలయికలో రాబోతున్న సినిమా గత ఏడాది ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సూచన మేరకు మహేశ్ బాబు.. త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడట. అంటే అది పూర్తయ్యాకే ఇది పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
Rashmika Mandanna: స్పోర్ట్స్ బ్రాతో శ్రీవల్లి రచ్చ.. నాకిష్టం అంటూ అలా చూపిస్తూ!

ఈ సినిమాలో విలన్‌గా తెలుగు హీరో
భారీ
బడ్జెట్‌తో
తెరకెక్కనున్న
ఈ
ప్రాజెక్టులో
మహేశ్
బాబుతో
పాటు
మరో
స్టార్
హీరో
కూడా
నటించబోతున్నట్లు
ఎన్నో
రోజులుగా
ప్రచారం
జరుగుతోంది.
ఇందులో
భాగంగానే
ఇప్పటికే
ఎంతో
మంది
హీరోల
పేర్లు
కూడా
తెరపైకి
వచ్చాయి.
అలాగే,
ఇందులో
విలన్‌గా
చేసేది
కూడా
స్టార్
హీరోనే
అని
అంటున్నారు.
తాజా
సమాచారం
ప్రకారం..
ఈ
పాత్రను
గోపీచంద్
చేస్తున్నాడట.

20 ఏళ్ల తర్వాత మరోసారి వీళ్ల వార్
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోతున్న సినిమాలో టాలీవుడ్ హీరో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నాడని ఫిలిం నగర్లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. 20 ఏళ్ల క్రితం వచ్చిన మహేశ్ మూవీ 'నిజం'లో గోపీచంద్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.