హ్యాట్రిక్ పై కన్నేసిన గోపీచంద్, ఆ దర్శకుడితో సినిమా!
విభిన్నమైన కథ, కథనాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తాజాగా మోహన్ లాల్ తో మనమంతా సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. విమర్శకుల ప్రశంశలు పొందించి ఆ సినిమా. మనమంతా సినిమా విడుదల తరువాత ఈ డైరెక్టర్ చెయ్యబోతున్న సినిమా పై క్లారిటి వచ్చింది.
ఇటీవల చంద్ర శేఖర్ యేలేటి సాయి ధరమ్ తో సినిమా చేయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి సాయి ధరమ్ తేజ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు కాని.. కరుణాకరన్ సినిమా విడుదల తరువాత ఈ సినిమా స్టార్ట్ చేద్దామని సాయి చెప్పినట్లు తెలుస్తోంది. కాని చంద్ర శేఖర్ యేలేటి సాయితో సినిమా చెయ్యడం లేదని తాజా సమాచారం.

సాయి ధరమ్ కు చెప్పిన పాయింట్ గోపీచంద్ కు చెప్పాడని సమాచారం. త్వరలో వీరి కాంబినేషన్ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సాహసం, ఒక్కడున్నాడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందేమో చూడాలి. గోపీచంద్ నటించిన తాజా సినిమా పంతం పై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











