ఆ దర్శకుడుకి స్క్రిప్టులో గోపీచంద్ సూచనలు
యువత, ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశరామ్ దర్శకత్వంలో గోపీచంద్ కన్ఫర్మ్ గా చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా దర్శకుడు పరుశరామ్ నేరేట్ చేసిన స్క్రిప్టులో ఫస్ట్ హాఫ్ లో కొన్ని మార్పులు చెప్పారని తెలుస్తోంది. అలాగే ఇంట్రడక్షన్ సీన్ ఒకటి మార్చమని గోపీచంద్ కోరారని తెలుస్తోంది. అలాగే స్క్రిప్టు మరీ లైటర్ వీన్ గా కాకుండా యాక్షన్ కీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, తన గత చిత్రాల ధోరణిలోనే ఉండాలని ఖచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రచయిత కూడా అయిన పరుశరామ్ ఆ మార్పులకు అంగీకరించి ఆ పనిలో ఉన్నారు. ఇక గోపీచంద్ తాజా చిత్రం గోలీమార్ ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. చక్రి సంగీతం అందిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











