విక్రమ్ స్థానంలో గోపీచంద్?
తమిళ డైరెక్టర్ భూపతి పాండ్యన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా సినిమా తీయాలని గతంలో నిర్ణయించారు. అయితే ఇప్పడు పరిస్థితి మారింది. విక్రమ్ స్థానంలో గోపీచంద్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడట దర్శకుడు. సినిమా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....భూపతి పాండ్యన్, విక్రమ్ కాంబినేషన్‌లో యాక్షన్‌మూవీ చేయాలని గతంలో యోచించారు. విక్రమ్ సరసన హీరోయిన్‌గా ఇలియానను ఎంపిక చేశారు.
అయితే ఈ ప్రాజెక్టుకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఏర్పడటంతో ఆ సమస్యల నుండి బయట పడటానికి ఇంత కాలం పట్టింది. ప్రస్తుతం విక్రమ్ వేరే ప్రాజెక్టుతో బీజీగా ఉండటంతో.... మంచి యాక్షన్ ఇమేజ్ ఉన్న గోపీచంద్‌తో ఆ సినిమా పూర్తి చేయాలని భూపతి పాండ్యన్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. గోపీ చంద్ సరసన తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











