కష్టకాలంలో ప్రభాస్ ఇంటికి వెళ్లిన గోపిచంద్.. బిజీగా ఉన్నప్పటికీ తప్పట్లేదు!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోల మధ్య స్నేహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్నిసార్లు వారి స్నేహంకు స్టార్ ఇమేజ్ కూడా అడ్డుపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎంతో ఫ్రెండ్లిగా ఉన్న స్టార్స్ కొందరు ఇప్పుడు మాత్రం రేంజ్ మారడంతో కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇద్దరి హీరోలలో ఎవరో ఒకరు అనుకోకుండా ఉన్నత స్థాయికి వెళ్తే కొంత మార్పులు రావడం సహజం.
అయితే కొందరు మాత్రం స్థాయి ఎంత పెరిగినా కూడా ఒకేలా ఉంటారు. అలాంటి స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ ఫ్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్నేహితుల కోసం ఎంత దూరమైనా సరే వెళతాడు. అతని చుట్టూ కూడా ఎక్కువగా స్నేహితులే ఉంటారు. గోపీచంద్ కూడా మంచి మిత్రుడైని అందరికి తెలిసిందే.
అయితే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తుండగా హోపి మాత్రం ఇంకా మీడియం రేంజ్ లోనే ఉండి పోయాడు. ఇక నెక్స్ట్ సీటిమార్ సినిమాతో ఎలాగైనా గోపీచంద్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. అందుకోసం ప్రభాస్ రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఒకేసారి మొదలైన ప్రయత్నంలో
ప్రభాస్ గోపీచంద్ ఇద్దరి కెరీర్ కూడా దాదాపు ఒకేసారి మొదలైంది. అలాగే మొదటి సక్సెస్ రావడానికి కూడా చాలా సమయం పట్టింది. ఇద్దరికీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అవకాశాల కోసం సొంతంగానే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. మొదటి సారి వర్షం సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. గోపీచంద్ విలన్ ప్రభాస్ హీరో అయినప్పటికీ ఏమాత్రం భేదాలు లేకుండా ఇద్దరూ ఒక అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి కొనసాగారు.

దూరం అవ్వలేదు..
ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా కలుసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. అయితే ప్రభాస్ బాహుబలి అనంతరం ఎక్కువ బిజీ అవడం వల్ల ఎందుకో కాస్త దూరమయ్యాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పటికీ కూడా గోపిచంద్ ప్రభాస్ ఖాళీ సమయంలో కలుసుకుంటూనే ఉంటారు. ఇక ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే గోపీచంద్ మాత్రం హిట్స్ కోసం పరితపిస్తున్నాడు.

ప్రభాస్ ఇంటికి వెళ్లిన గోపిచంద్
ఇక ఇప్పుడు ఎలాగైనా ఒక బాక్స్ ఆఫీస్ సీట్ అందుకోవాలని సిటీ మార్ అనే యాక్షన్ సినిమా చేశాడు. సీటిమార్ సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ టాక్ ఉంది. కానీ ఈ కరోనా కష్టకాలంలో సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఇంకా భారీ స్థాయిలో ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే గోపీచంద్ మరోసారి ప్రభాస్ సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల గోపిచంద్ ప్రభాస్ ఇంటికి వెళ్లే రిలీజ్ వేడుకకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ..
అయితే ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు వరుసగా నాలుగు సినిమాలు సెట్స్ పై ఉండడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులులను కూడా కొన్నిసార్లు ముంబయికి తీసుకెళ్లి వారికి కొంత సమయం కేటాయిస్తున్నారు. ఇక ఫైనల్ గా ప్రభాస్ గోపీచంద్ కోసం అయితే రిలీజ్ వేడుకకు వస్తానని చెప్పాడట. సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే నెక్స్ట్ వారంలో గ్రాండ్ గా రిలీజ్ వేడుకలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రమోషన్ తో సిటీ మార్ జనాల్లోకి ఎంత వరకు వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











