గోపీచంద్ షూటింగ్ కు మంచు దెబ్బ
గోపిచంద్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ గోలీమార్ చిత్రం కోసం సియోల్, బీజింగ్ లలో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే ఇది చలికాలం కావటంతో అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. ఓ ప్రక్క ఈ విషయం ట్రావెల్ ఏజెంట్స్,టీవీ ఛానెల్స్ చెప్తూనే ఉన్నారు. అయినా కెమెరామెన్ శ్యామ్ కె.నాయుడు పట్టుదలతో అక్కడికి యూనిట్ బయిలు దేరి వెళ్ళింది. అయితే అక్కడ అరగంట కూడా ఉండలేని సిట్యువేషన్ ఏర్పడింది. విపరీతమైన చలి, ఈదురు గాలులు, దట్టమైన పొగమంచు వారిని భయపెట్టాయి. దాంతో వారు తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. ఇక ఈ ట్రిప్ కు చాలానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అలాగే అక్కడ కురిసే మంచు నుంచి రక్షించుకోవటం కోసం యూనట్ కి ప్రత్యేకంగా డ్రస్ లు నిర్మాత ఏర్పాటు చేసారని వినికిడి. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నిర్మాత గట్టివాడైతే మన ఇష్టమెచ్చినట్లు ప్రయోగాలు చేయవచ్చు అని బహిరంగంగానే అంటున్నారు.


Click it and Unblock the Notifications











