హీరోకి తగ్గ టైటిల్ కాదు

By Srikanya

హైదరాబాద్ : సినిమా జనాల్లోకి వెళ్లాలంటే కథ,కథనం ఎంత ముఖ్యమో...దాని టైటిల్ కూడా అంతే ముఖ్యం. అందుకే సినిమావాళ్లు ఎక్కువ శ్రమ తీసుకుని కొత్త తరహా టైటిల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తూంటారు. అయితే కొందరు తమ చిత్రాల టైటిల్స్ ..తమ కెరీర్ సెంటిమెంట్ కి అనుగుణంగా ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం గోపిచంద్ అలాగే చేస్తున్నాడంటున్నారు. అతని తాజా చిత్రానికి లౌక్యం...(ఇంగ్లీష్ లో డిప్లమసీ) అని పెట్టారు. ఈ టైటిల్ అతని హిట్స్ రణం, శౌర్యం, లక్ష్యం తరహాలో ఉన్నా...టైటిల్ లో కిక్ లేదంటున్నారు. చిన్న పిల్లలు చదివే చందమామ కథలుకి పెట్టే టైటిల్ లాగ ఉందని అంతటా విమర్శలు వినపడుతున్నాయి. గోపిచంద్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోకి ఇలాంటి టైటిల్ పెట్టడం ఆశ్చర్యకం అంటున్నారు.

అయితే దర్శక,నిర్మాతలు ఈ టైటిల్ ని జస్టిఫై చేయటానికి చిత్రంలో అతని క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో అధిగమించడం ఆ యువకుడి నైజం. పరిస్థితి చేయిదాటుతుందని తెలిస్తే చేయి చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడని తెగువ అతని సొంతం. లౌక్యం, చాకచక్యంతో ఏ యుద్ధాన్నైనా గెలిచే ధైర్యం అతనిది. అలాంటి యువకుడు ఓ పవిత్రమైన లక్ష్యం కోసం చేసిన పోరాటం ఏమిటో తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు శ్రీవాస్.

Gopichand's new film is titled Loukyam

భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్. పాటల చిత్రీకరణ ఆగస్టు 5నుంచి మొదలుకానుంది. ఈ చిత్రంలో గోపీచంద్ పాత్ర చిత్రణ శక్తివంతంగా వుంటుంది. హంసానందినిపై ప్రత్యేకగీతంతో పాటు హీరోహీరోయిన్లపై విదేశాల్లో పాటల్ని చిత్రీకరించబోతున్నాం. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ వైవిధ్యమైన బాణీలను అందించారు. సెప్టెంబర్ మొదటివారంలో ఆడియోను, అదే నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. గోపీచంద్‌ వేగం పెంచారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X