గోపీచంద్ ‘సీటీమార్’ మరోసారి వాయిదా: స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ఆరోజున విడుదల

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలు విడుదల కాగా.. అందులో చాలా వరకూ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న మూవీల రిలీజ్ డేట్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అయితే, పెద్ద హీరోల చిత్రాలకు మాత్రం పోటీ ఉండకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ తమ విడుదల తేదీలు ప్రకటించేందుకు వేచి చూసే ధోరణిని ఫాలో అవుతున్నారు. దీంతో చాలా రిలీజ్ డేట్లు సస్పెన్స్‌గా మారాయి.

చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్.. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమాను చేశాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. విడుదలకు సిద్ధంగానే ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సందేహాల నడుమ ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, తాజాగా దీనిపై మరో ఊహించని వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 Gopichands Seetimaarr​ Movie Postponed to September 10th

గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీని మరోసారి వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందనేదే ఆ వార్త సారాంశం. ఇటీవలే ప్రకటించినట్లుగా ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, దీన్ని ఓ వారం తర్వాత అంటే సెప్టెంబర్ 10న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుందట. ఆరోజు వినాయక చవితి పండుగ ఉంది. దీన్ని పురస్కరించుకునే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని తాజా సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి.

'సీటీమార్' మూవీ విషయానికి వస్తే.. ఇది పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక, ఇందులో మునుపటి గోపీచంద్‌ను చూడడం ఖాయమన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంపై యూనిట్‌కు ఉన్న నమ్మకం వల్లే దీనికి భారీగా ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. థియేటర్లలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సీటీమార్‌' మూవీలో గోపీచంద్‌, తమన్నా రెండు కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X