Akhanda 2: బాలయ్యకు విలన్‌గా ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్.. అఖండ 2 మల్టీస్టారర్ మూవీనా!

ఏజ్ పెరిగిపోతోన్నా ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఫలితంగా మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా లైన్‌లో పెట్టుకున్నారు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకునేలా ప్లాన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నటించబోతున్న 'అఖండ 2' సినిమా మల్టీస్టారర్‌గా రాబోతుందని తాజాగా తెలిసింది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

హ్యాట్రిక్ హిట్లతో బాలయ్య
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న సమయంలో బాలకృష్ణ 'అఖండ' అనే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ వెంటనే 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్‌ను కూడా అందుకున్నారు. ఈ ఉత్సాహంలోనే బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ చేశారు. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించడంతో ఆయన ఖాతాలో హ్యాట్రిక్ చేరింది.

Gopichand to play Villain Role in Nandamuri Balakrishna Starrer Akhanda 2 Movie

బాబీతో భారీ ప్రాజెక్టులోనూ

నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. అంతేకాదు, చాలా వరకూ టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చే ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో
నందమూరి బాలకృష్ణ తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేసిని వెంటనే బోయపాటి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారట.

Gopichand to play Villain Role in Nandamuri Balakrishna Starrer Akhanda 2 Movie

బాలయ్య మూవీలో కొడుకు

'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త ప్రాజెక్టుపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ఫలానా వాళ్లు నటిస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. అందులోనూ నందమూరి మోక్షజ్ఞ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడని ఓ న్యూస్ సెన్సేషన్ అయిపోయింది.

విలన్‌గా గోపీచంద్ రెడీగా
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందబోతున్న 'అఖండ 2' మూవీలో నటించే విలన్ గురించి తాజాగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్యను ఢీకొట్టే విలన్‌గా మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్నాడట. ఇప్పటికే అతడికి బోయపాటి స్టోరీని కూడా వినిపించాడని, దీనికి వెంటనే ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది.

Gopichand to play Villain Role in Nandamuri Balakrishna Starrer Akhanda 2 Movie

అప్పటి నుంచి ఫ్రెండ్లీగా

బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ సీజన్‌లో గోపీచంద్ గెస్టుగా వచ్చాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య బంధం ఏర్పడింది. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని అంటున్నారు. దీంతో ఈ చిత్రం మల్టీస్టారర్‌గా మారబోతుందని చెప్పొచ్చు. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X