నెవ్వర్ బిఫోర్ అనేలా మరో మల్టీస్టారర్.. గోపీచంద్‌తో కలవబోతున్న సీనియర్ హీరో..

గత కొంతకాలంగా మల్టీస్టారర్ హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ కరెక్ట్ గా సెట్టయితే స్టార్ హీరోలు తోటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం నో చెప్పడం లేదు. ఒక విధంగా గతంలో కంటే నేటితరం హీరోల మధ్య స్నేహం ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఇక త్వరలోనే మరో మంచి మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి రానున్నట్లు టాక్ అయితే వస్తోంది.

 గోపిచంద్ కూడా

గోపిచంద్ కూడా

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం టాలీవుడ్ లో మరిన్ని మల్టీస్టారర్ కథలకు బాట వేసినట్లే అని చెప్పవచ్చు. త్వరలోనే గోపిచంద్ కూడా ఒక సీనియర్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

వరుసగా డిజాస్టర్స్

వరుసగా డిజాస్టర్స్

మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న గోపిచంద్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మరో మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. గోపి కమర్షియల్ గా సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. ఆక్సిజన్, పంతం, చాణక్య వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.

 మల్టీస్టారర్ మూవీ

మల్టీస్టారర్ మూవీ

ఇక నెక్స్ట్ గోపిచంద్ సీటిమార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ సినిమాకు పక్కా కమర్షియల్ అనే టైటిల్ సెట్ చేశారు. ఇక శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఇద్దరు హీరోలు ఉంటారని టాక్ వస్తోంది.

 పవర్ఫుల్ పాత్రలో రాజశేఖర్

పవర్ఫుల్ పాత్రలో రాజశేఖర్

గోపిచంద్ - శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లక్ష్యం బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఏంటర్టైనర్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమాలో గోపిచంద్ కు అన్నయ్య పాత్రలో జగపతిబాబు నటించి అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక సారి చేయబోయే సినిమాలో పవర్ఫుల్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ ను అనుకుంటున్నట్లు టాక్ అయితే వస్తోంది.

Recommended Video

Actor Gopichand Inspiring Life Story | Filmibeat Telugu
 గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..

గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..

రాజశేఖర్ కూడా విభిన్నమైన కథలు వస్తే తోటి హీరోలతో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎప్పుడో చెప్పాడు. ఇక శ్రీవాస్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఆయన సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాడట. అయితే పాత్రలో ఇంకా కంటెంట్ ను పెంచాలని మరోసారి స్క్రిప్ట్ పై కూర్చున్నట్లు సమాచారం. సినిమా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సిద్ధమైతే వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X