ఆ తెలుగు హీరో కూతురుతో గోపీచంద్ పెళ్లి?
అనూష్కతో ఆ మధ్య పెళ్ళి జరగబోతోందంటూ గోపిచంద్ గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కేవలం రూమర్సే అని తేలిపోయాయి. అయితే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. గోపీచంద్ తెలుగులో పేరున్న హీరో జగపతి బాబు కూతురుని వివాహం చేసుకునే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మాటలుజరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ముప్పై ఒక్క సంవత్సరాల గోపీచంద్ కి వివాహం ఈ సంవత్సరంలోనే చేసేయ్యాలని అతని కుటుంబ సభ్యులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపధ్యంలో జగపతి బాబుకి చెందిన శ్రేయాభిలాషులు ద్వారా ఈ ప్రపోజల్ వెళ్లినట్లు సమాచారం.
ఇక జగపతి బాబు, గోపీచంద్ కలిసి గతంలో లక్ష్యం సినిమాలో నటించారు. ఇక ప్రస్తుతం జగపతి బాబు చేతిలో పెద్దగాయ సినిమాలు లేవు. గోపీచంద్ మాత్రం కృష్ణ వంశీ దర్శకత్వంలో మొగుడు చిత్రం చేస్తున్నారు. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











