'అహ నా పెళ్ళంట' దర్సకుడు నెక్స్ట్ చిత్రం ఆ పెద్ద హీరోతో
గోపీచంద్ మరో చిత్రం కమిటయ్యాడు. ఇటీవల వచ్చిన 'అహ నా పెళ్ళంట' సినిమా ద్వారా పరిచయమైన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నటించడానికి యాక్షన్ హీరో గోపీచంద్ ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. వీరభధ్రమ్ చెప్పిన కథను విన్న గోపీచంద్ స్టోరీ లైన్ ఓకే చేసి కొన్ని స్క్రిప్టు కరెక్షన్స్ చెప్పాడని తెలుస్తోంది. ఇక అల్లరి నరేష్ తో చేసిన అహనా పెళ్ళంట చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా బాగానే హ్యాండిల్ చేసాడనే పేరు మాత్రం వచ్చింది. ప్రస్తుతం గోపీచంద్...కృష్ణవంశీతో మొగుడు అనే చిత్రం చేస్తున్నారు. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే యేలేటి చంద్రశేఖర్ దర్సకత్వంలోనూ ఓ చిత్రం కమిటయ్యినట్లు వినపడుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత వీరభద్రమ్ సినిమా ఉంటుందా లేక ముందే ఉంటుందా అనేది తేలాలి.


Click it and Unblock the Notifications











