గోపిచంద్ తో దర్శకుడు వీరభద్రం డిటేల్స్...
'అహ నా పెళ్ళంట' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వీరభద్రం భవ్య క్రియేషన్స్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించటానికి కమిటయ్యాడని సమాచారం. గతంలో 'శౌర్యం", 'అమరావతి", 'వాంటెడ్" చిత్రాలు నిర్మించిన భవ్య క్రియేషన్స్ వీరభద్రమ్‌తో నిర్మించే చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం గోపీచంద్ హీరోగా చేయనున్నాడు. వీరభధ్రమ్ చెప్పిన కథను విన్న గోపీచంద్ స్టోరీ లైన్ ఓకే చేసి కొన్ని స్క్రిప్టు కరెక్షన్స్ చెప్పాడని తెలుస్తోంది. ఇక అల్లరి నరేష్ తో చేసిన అహనా పెళ్ళంట చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా బాగానే హ్యాండిల్ చేసాడనే పేరు మాత్రం వచ్చింది. ప్రస్తుతం గోపీచంద్...కృష్ణవంశీతో మొగుడు అనే చిత్రం చేస్తున్నారు. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే యేలేటి చంద్రశేఖర్ దర్సకత్వంలోనూ ఓ చిత్రం కమిటయ్యినట్లు వినపడుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత వీరభద్రమ్ సినిమా ఉంటుందా లేక ముందే ఉంటుందా అనేది తేలాలి.


Click it and Unblock the Notifications











