హనీమూన్ క్యాన్సిల్ .. అప్పుడే భర్తకు దూరంగా, కీర్తి సురేష్‌పై దారుణంగా రూమర్స్
గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలో హీరో , హీరోయిన్ల మధ్య ఎన్నో పుకార్లు వైరల్ అవుతుంటాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో హీరో హీరోయిన్లు , నటీనటులు ఇలాంటి పుకార్ల బారినపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా రాకతో దారుణంగా గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి. వీటితో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమవుతోంది. కొన్ని సందర్భాల్లో నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి రచ్చ చేస్తున్నారు పుకారు రాయుళ్లు. ప్రస్తుతం ఇలాంటి వారికి బాధితురాలిగా మారారు హీరోయిన్ కీర్తి సురేష్.
అందం, అభినయం, అదృష్టం అన్నీ కలిసొచ్చిన హీరోయిన్లు అతికొద్దిమంది ఉంటారు. ఇలాంటి వారిలో ఒకరు కీర్తి సురేష్. మలయాళ నిర్మాత జీ సురేష్ కుమార్, అలనాటి హీరోయిన్ మేనకా దంపతుల కుమార్తె కీర్తి సురేష్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో కీర్తికి చాలా త్వరగానే వెండితెరపై ఛాన్స్ దక్కింది. కానీ అది కేవలం అరంగేట్రం వరకే, హీరోయిన్ అయ్యాక వరుస పరాజయాలు పలకరించి ఐరెన్ లెగ్ ట్యాగ్ వేయించుకుంది. కానీ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసిన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

నేను శైలజతో తెలుగు వారిని పలకరించిన కీర్తి సురేష్‌కు మంచి విజయం సైతం అందింది. తన క్యూట్ లుక్స్, అందంతో కుర్రాళ్లకు కితకితలు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు తర్వాత అవకాశాలు క్యూకట్టాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తున్న దశలో మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రిలా అద్భుతంగా నటించింది కీర్తి సురేష్. అంతేకాదు.. ఈ సినిమాకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది.
అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు ఒకదానికొకటి నిరాశ పరిచాయి. ఈ దశలో గతేడాది విడుదలైన దసరా, మామన్నన్ చిత్రాలతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చారు కీర్తి సురేష్. ఈ ఏడాది సైరన్, రఘుతాత చిత్రాలలో నటించిన ఆమె.. ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నివేడి, ఉప్పుకప్పురంబులు చేస్తున్నారు. అలాగే బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్తోంది.
నేమ్ అండ్ ఫేమ్‌లో ఉన్న హీరోయిన్‌పై పుకార్లు రావడం సహజం .. కానీ ఇలాంటి వాటిపై ఎప్పుడూ కీర్తి సురేష్ స్పందించలేదు. సరిగ్గా కొద్దిరోజుల క్రితం కీర్తి ప్రేమ విషయం బయటికొచ్చి.. ఆమె పెళ్లి గోవాలో రెండ్రోజుల పాటు జరగనుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం కీర్తి స్వయంగా స్పందించి తాను 15 ఏళ్లుగా తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, గోవాలో పెళ్లి నిజమేనని తిరుమల శ్రీవారి సాక్షిగా అనౌన్స్ చేసింది. అన్నట్లుగా గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కనీసం భర్తతో కలిసి హనీమూన్‌కు కూడా వెళ్లకుండా తన తొలి హిందీ డెబ్యూ మేరీ జాన్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంది. ఇలాంటి దశలో కీర్తి సురేష్‌పై సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కీర్తి ప్రస్తుతం ఏ కొత్త సినిమాకు అంగీకారం తెలపడం లేదని.. కొద్దికాలం భర్తతో గడపాలని అనుకుంటోందని, అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని గాసిప్స్ వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











