Fact Check: అక్కినేని హీరోతో మీనాక్షి చౌదరీ ఎంగేజ్‌మెంట్.. సడెన్‌గా ఊహించని విధంగా!

గతంలో గాసిప్స్‌కు బాలీవుడ్ అడ్డాగా ఉండేది. హీరో, హీరోయిన్ల మధ్య అఫైర్ రూమర్లు, అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల వార్తలు ఎప్పుడూ మీడియాలో గుప్పుమనేవి. అయితే ఆ సంస్కతి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా పాకింది. అయితే కొన్ని సార్లు రూమర్లు నిజమవ్వొచ్చు. కానీ ఊహించిన విధంగా ఇద్దరికి సంబంధం అంటగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. తాజాగా తెలుగు సినిమా రంగంలో ఓ యువ హీరో, హీరోయిన్‌కు ఎంగేజ్‌మెంట్ అయిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమన్నది. ఆ వార్తలో నిజమెంత అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు మీనాక్షి చౌదరీ. గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించి వరుసు విజయాలు అందుకొన్నది. తాజాగా ఈ అందాల భామ నటించిన మట్కా సినిమా నవంబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఈ అమ్మడు పెట్టుకొన్నది.

Gossip Is Meenakshi Chaudhary engaged to Sushanth Anumolu Here is the fact check of rumour

ఇక మీనాక్షి చౌదరీ నటించిన మరో సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నది. విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా కూడా నవంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్నది. దాంతో ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఒకే ఏడాదిలో 4 సూపర్ హిట్స్ అందుకొన్న ఘనతను సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నది.

ఇలా కేరీర్ పరంగా మీనాక్షి చౌదరీ దూసుకెళ్తున్న సమయంలో సడెన్‌గా ఎవరూ ఊహించని విధంగా ఓ రూమర్ ఈ బ్యూటీపై వచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది అనే ఓ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పోస్టు పెట్టారు.

Gossip Is Meenakshi Chaudhary engaged to Sushanth Anumolu Here is the fact check of rumour

అయితే గాసిప్ వార్తపై అటు మీనాక్షి, సుశాంత్ పీఆర్ వర్గాలు ఖండిచారు. ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి రూమర్లను నమ్మకూడదని వెల్లడించారు. కనీసం వారిద్దరూ కలిసి కూడా నటించలేదు. వారి మధ్య అంతగా పరిచయం కూడా లేదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈ రూమర్ క్రియేట్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటి? ఈ వార్త క్రియేట్ చేసిన వారి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వారిని టార్గెట్ చేస్తూ కొన్ని రూమర్లు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలా టార్గెట్ చేయడం వెనుక ఏదైనా ఉందా? ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ఓ టాలెంటెడ్ హీరోయిన్‌పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఖండించాల్సిన విషయమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X