ఆమెకు ఇక్కడ నాగర్జున... తమిళనాడులో విక్రమ్!
చెన్నయ్: హీరోయిన్ అనుష్క ఈ రేంజికి చేరడానికి ఆమె అభినయం, గ్లామర్ తో పాటు హీరో నాగార్జున సపోర్టు కూడా ఉందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరి మధ్య 'సం'బంధం ఉందని ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలి నాళ్ల నుంచి వినిపిస్తున్న గాసిప్స్. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా నాగార్జున ఆమెతో చాలా క్లోజ్‌గా ఉండటం, ఆమెకు తన సినిమాల్లో ఎక్కువ అవకాశాలు ఇస్తుండటం జరుగుతూ వచ్చింది.
అనుష్క కేవలం తెలుగులోనూ కాదు తమిళంలోనూ దూసుకెలుతోంది. తాజాగా చెన్నయ్ నుంచి వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే...ఇక్కడ నాగార్జునతో క్లోజ్‌గా ఉండి టాలీవుడ్ అవకాశాలు దక్కించుకున్నట్లుగా....తమిళనాట హీరో విక్రమ్‌తో చాలా క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తుందట ఈ బెంగుళూరు బ్యూటీ. మరి ఇండస్ట్రీలో పైకి రావాలంటే ఆ మాత్రం తెలితేటలు ఉండాలి మరి!
ప్రస్తుతం అనుష్క విక్రమ్ తో 'తాండవం' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగులో 'శివ తాండవం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాతలు. అనుష్క, లక్ష్మీరాయ్, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
మరో వైపు నాగార్జునతో అనుష్క నటించిన చిత్రం డమరుకం. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











