పెళ్లి చేసుకోబోతున్న అనుష్క శెట్టి.. వైరల్‌గా స్వీటి మ్యారేజ్ న్యూస్!

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి అఫైర్ గురించి రకరకాల రూమర్లు మీడియాలో కొన్ని సంవత్సరాల నుంచి మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉన్నాయి. కానీ తనపై వస్తున్న వార్తలకు స్పందించడం గానీ, వివరణ ఇవ్వడం గానీ చేసినట్టు కనిపించలేదు. తన మౌనమే అలాంటి గాసిప్ వార్తలకు తిరుగులేని సమాధానంగా మార్చేలా చేశారు. అయితే కొద్దికాలంగా మీడియాకు, ఇండస్ట్రీ దూరంగా ఉంటున్న స్వీటి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సున్నితమైన, భావోద్వేగమైన వ్యక్తిగా ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకొన్న అనుష్క శెట్టికి, తన సహచర నటుడు, పాన్ ఇండియా స్టార్‌తో అఫైర్ ఉందనే వార్త అప్పట్లో సంచలనం రేపాయి. వారిద్దరి డేటింగ్ వ్యవహారంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఆ వార్త జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయింది. దానిపై ఆ హీరోగానీ, ఇటు అనుష్క గానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆ వార్తకు ప్రధాన్యం కోల్పోయింది.

Gossip on Anushka Shetty Marriage

అనుష్క శెట్టి కెరీర్ గమనిస్తే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల చేయడం గణనీయంగా తగ్గించుకొన్నది. తన పర్సనల్ పనులపై దృష్టిపెట్టారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి.. ప్రస్తుతం ప్రతీనెల భారీగా ఆదాయాన్ని, స్థిర ఆస్తులను కూడగట్టుకొని సేఫ్ జోన్‌లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెపుకొంటాయి. అయితే ఇప్పటికీ అనుష్క పర్సనల్ లైఫ్ మీడియాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గానే ఉంటుంది.

అయితే ఇటీవల కాలంలో అనుష్క పెళ్లి వ్యవహారం మరోసారి మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ ఏడాదిలో అనుష్క వివాహం చేసుకోవడానికి సిద్దం అవుతున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నది. తన ఫ్యామిలీలోనే దగ్గర రిలేషన్ వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే అనుష్క శెట్టి పెళ్లి జరుగుతుందని ఆ రూమర్ వార్త సారాంశం.

అయితే సోషల్ మీడియాలోని కథనాల ప్రకారం.. అనుష్క శెట్టి వివాహ చేసుకోబోతున్నారనే చెబుతున్న వ్యక్తి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి జరిపించేందుకు ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్తలో వాస్తవం ఎంత? అనేది తేలాలంటే.. వారి నుంచే ఏదైనా స్పందన వస్తే క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అనుష్క శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఘాటీ చిత్రాల్లో నటించారు. అలాగే మలయాళంలో కథనార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా కొన్ని సినిమాల కథలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తున్నది.

More from Filmibeat

Read more about: anushka shetty ghaati Kathanar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X