పవన్ కళ్యాణ్ ఫారిన్ ట్రిప్‌పై నమ్మలేని నిజాలు?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ తర్వాత విదేశీయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అన్ని ప్రముఖ పత్రికలతో పాటు, మీడియాలో కూడా ఈ వార్తలు ప్రముఖంగా వినిపించాయి. అక్టోబర్ 15న ఇక్కడి నుంచి బయల్దేరిన ఆయన ఈ నెల 28న నేరుగా ఫారిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ విదేశీ యాత్రపై ఓ నమ్మకలేని వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ నేరుగా విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకోలేదని ఆ వార్తల సారాంశం. ఈ వార్త కాస్త నమ్మశక్యంగా లేక పోయినా.... అందుకు ఆధారాలు కూడా లభించడంతో నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రెబల్ చిత్రంలో విలన్ గా నటించిన విక్రమ్ సింగ్ ట్విట్టర్లో వ్యాఖ్యలు... పవన్ ఫారిన్ ట్రిప్ పై అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి. ఈ నెల అక్టోబర్ 27న ఆయన తన ట్విట్టర్లో..... ''ముంబై నుంచి గోవా వెళ్లే ఫ్లైట్ లో నిన్న పవన్ కళ్యాణ్‌ని కలిసాను. మాట్లాడాను. నైస్ పర్సన్. రిజర్వ్డ్ గా ఉంటారు. కానీ చాలా మంచి వ్యక్తి'' అంటూ ట్వీట్ చేసారు.
పవన్ కళ్యాణ్ ఈ నెల 28న నేరుగా విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకుంటే.... ఈ నెల 26న ముంబై నుంచి గోవా ఎలా ఆయనకు ఎలా కలిసారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ విదేశాలకు వెళ్లలేదని, ఇండియాలోనే ఉన్నారని, కానీ మీడియాలో మాత్రం విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం చేసారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో విదేశాలకు వెళ్లి వస్తూ ముంబైలో దిగి అక్కడి నుంచి గోవా వెళ్లి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్తల్లో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
'రెబల్' చిత్రంలో గ్యాంగ్ స్టర్ బ్రదర్‌గా విలన్ పాత్ర పోషించిన విక్రమ్ సింగ్... మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా బ్యాడ్ బాయ్ పాత్రలో మహేష్ బాబుతో ఫైట్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈచిత్రం షూటింగులో మహేష్, విక్రమ్ సింగ్ మధ్య ఫైట్ సీన్లు చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











