twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘SVSC’ స్టోరీ ఇదేనా‌?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యామిలీ ప్రేక్షకులు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రేపు(జనవరి 11)న ఈచిత్రం గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

    శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై బారీ బడ్జెట్‌తో నిర్మించారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం స్టోరీ లైన్ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు, లక్ష్మణుల పాత్రల్లా ఉంటాయి వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు. కాగా... విడుదలకు ముందే ఈచిత్రం స్టోరీ లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ నుంచి అందిన న్యూస్ ప్రకారం SVSC స్టోరీ క్రింది విధంగా ఉంది.

    మల్లిఖార్జునరావు(వెంకటేష్), సీతారామరాజు(మహేష్ బాబు) అన్నదమ్ములు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మల్లిఖార్జునరావు చాలా సాఫ్ట్ పర్సన్. తన మరదలు(అంజలి)ని పెళ్లి చేసుకుంటాడు. సీతారామారాజు స్ట్రైట్ పార్వడ్‌గా ఉండే వ్యక్తిత్వం. వైజాగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన సీతారామరాజు ఉద్యోగం కోసం తమ సొంత ప్రాంతానికి వస్తాడు. కోటీశ్వరుడి(రావు రమేష్) కూతురైన సమంతను సీతారామరాజు ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు.

    ఈ వివాహం అనంతరం అన్నదమ్ముల మధ్య చిన్నపాటి విభేదాలు వస్తాయి. ఇది కాస్తా వారి తండ్రి మరణానికి దారి తీస్తుంది. అన్నదమ్ములు విడిపోతారు. ఆహుతి ప్రసాద్ ద్వారా మోసగించబడ్డ మల్లిఖార్జునరావు ఆస్తి విషయంలో గొడవ పడి గర్భవతిగా ఉన్న తన భార్యతో ఇంట్లో నుంచి వెళ్లి పోతాడు. వాస్తవానికి సీతారామా రాజు వాళ్ల తల్లిదండ్రుల సొంత పుత్రుడు కాదు. ఫ్యామిలో ఏర్పడ్డ వివాదాలను సాల్వ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. సీతారామరాజకు బ్రహ్మానందం సహకరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సినిమా ఆసక్తిగా సాగుతూ సుఖాంతం అవుతుంది. అయితే స్టోరీ ఇదేనా కాదా? అనేది రేపు సినిమా విడుదలైతే కానీ చెప్పలేం.

    English summary
    The fever of the much-hyped movie Seetamma Vakitlo Sirimalle Chettu (SVSC) is fast gripping the state as it nears its release date. Directed by Srikanth Addala, the film features Superstar Mahesh Babu, Victory Venkatesh, Anjali and Samantha in the lead roles. Prakash Raj and Jayasudha will appear in some important roles. Seetamma Vakitlo Sirimalle Chettu story is completely based on the brothers relations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X