'గోవిందుడు అందరివాడేలే' ఆడియో తేదీ ఖరారు
హైదరాబాద్ : రామ్‌చరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సంస్థ 'గోవిందుడు అందరివాడేలే' . ఈ చిత్రం ఆడియో ని ఆగస్టు 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజున అంటే ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి టాకి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గోవిందుడు అందరివాడేలే. కష్ణవంశీ దర్శకుడు. కాజల్ అగర్వాల్ కథానాయిక. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హదయాన్ని స్పశించే భావోద్వేగాలతో కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాను దర్శకుడు కష్ణవంశీ తెరకెక్కిస్తున్నారు.

నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు సినీ విలేజ్‌లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను నిర్మించారు. దీంట్లో ఇటీవల కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చిలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. జూన్ 5 నుంచి కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు.
ఆ తరువాత చిత్ర యూనిట్ లండన్ వెళుతుంది. అక్కడ పాటలతో పాటు కొన్ని సీన్‌లు చిత్రీకరిస్తాం. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రామ్‌చరణ్ కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా ఈ సినిమాను దర్శకుడు కష్ణవంశీ తీర్చిదిద్దుతున్నారు.
రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా వుంటుంది. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి. సంగీతం:యువన్‌శంకర్‌రాజా, రచన:పరుచూరి బ్రదర్స్.


Click it and Unblock the Notifications











