Balakrishna: దట్ ఇజ్ బాలయ్య... నమ్ముకున్న వాళ్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలడుగా!

నందమూరి నటసింహం బాలయ్య మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పైకి ఎంత కోపంగా, గంభీరంగా కనిపించినా... లోపల మనసు మాత్రం వెన్న అని అంటుంటారు. అయితే మరోసారి బాలయ్య గొప్పతనం ఏంటో బయటకు వచ్చింది. ఏపీ రాజకీయాల్లో బిజి బిజిగా ఉన్న బాలయ్య... తనను నమ్ముకున్న వాళ్లను సైతం మార్చిపోలేదు. అటు అనిల్ రావిపూడికి, ఇటు బాబీలకు బాలయ్య ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడారట. ఆ వివరాల్లోకి వెళితే...

నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య... తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తండ్రికి తగ్గట్లే రాజకీయాల్లో, సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి నోటా జై బాలయ్య అని పిలిపించుకుంటున్నాడు. ఇక జై బాలయ్య.. జై జై బాలయ్య... ఈ పదం ఎందుకు అంటారో మరోసారి రుజువు అయింది. ఆయన తనను నమ్ముకున్న వారిని ఎలాంటి పరిస్థితుల్లో వదలడు అని మరోసారి బయటకు వచ్చింది.

Re starts Bhagavanth Kesari shoot

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బాలయ్య బిజీగా గడుపుతున్నారు. దానికి కారణం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు. ఆయన్ని స్కిల్ డెవెల్మెంట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. దానికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించి... రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల పవన్ కల్యాణ్, బాలయ్, లోకేష్ కలిసి చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఆ సంగతి పక్కన పెడితే.. బాలయ్య రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఆయన షూటింగ్ లు ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇక భగవంత్ కేసరి అయితే వాయిదా పడనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే బాలయ్య.. అటు దర్శకుడు అనిల్ రావిపూడికి కాల్ చేసి దైర్యం చెప్పారట. ఎలాగైనా ఈ సినిమాను పూర్తి చేద్దాం అని చెప్పారట. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని సమాచారం.

Balakrishna pawan kalyan nara lokesh

ఇక మరోవైపు బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా విషయంలోనే కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చేది ఎలక్షన్ సీజన్. బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయాలి అంటే దాదాపు ఆరు నెలలు పడుతుంది. ఈ నేపథ్యంలోనే బాబీకి కాల్ చేసిన బాలయ్య... ఈ సినిమా చేయాలంటే నాకు టైం కావాలి. మీరు ఆగుతాను అంటే ఎలక్షన్స్ తర్వాత చేద్దాం. లేదంటే... ఇదే కథతో వేరే హీరోతో చేసిన నాకు ఓకే అంటూ అతనికి భరోసాను ఇచ్చాడట.

Greatness of Balakrishna

బాలయ్య తనను నమ్ముకున్న వారిని వదలకుండా ఇలా ఇద్దరి దర్శకులకు ఓ క్లారిటీ ఇవ్వడం నెట్టింట హాాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య చేసిన పనికి అందరూ దట్ ఇజ్ బాలయ్య, జై బాలయ్య అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. తనను నమ్మిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో బాలయ్య వదలడని మరోసారి రుజువు అయింది. ఇక బాలయ్య భగవంత్ కేసరి ఈ సారి దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X