ఆ రీమేక్ లో ఎన్టీఆర్, నాగచైతన్య
సూపర్ హిట్ డాన్ సినిమా రీమేక్ గా భిల్లా వచ్చినట్లే ఇప్పుడు మరో తెలుగు క్లాసిక్ రీమేక్ కానున్నట్లు సమాచారం. అప్పట్లో ఎన్టీఆర్,ఎ.ఎన్.ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రాన్ని ఇప్పటి కాలానికి తగినట్లు ఆధునీకరించి తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆ హీరోల మనవలు జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలు నటించే అవకాశమున్నట్లు చెప్తున్నారు. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్టు పై ఆసక్తి చూపారని చెప్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టుని ఓ భారీ చిత్రాల దర్శకుడు భుజానవేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలుగా సురేష్ ప్రొడక్షన్స్ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఇంకా కన్ఫర్మ్ కాలేదు..కానీ ఫిల్మ్ సర్కిల్స్ మాత్రం పాజిటివ్ గా చర్చల్లో నలుగుతోంది.అలాగే ఎన్టీఆర్, నాగార్జున అభిమానులను కూడా ఇది సంతోషపరిచే వార్తే. జోష్ చిత్రం తర్వాత ఈ ప్రాజెక్టు మెటిరియలైజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తి బిజీగా ఉన్న ఎన్టీఆర్ డేట్స్ ఎలా ఎడ్జెస్ట్ చేస్తారన్నది మాత్రం తేలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్..వి.వి.వినాయిక్ దర్శకత్వంలో అదుర్స్ చిత్రంలో ద్విపాత్రలలో కనిపించనున్నారు. అనంతరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో బృందావనం చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు. ఈ మధ్యలో అశ్వనీదత్ నిర్మాతగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం ఉంది.


Click it and Unblock the Notifications











