హేమ మాలిని తర్వాత బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఎవరు?
సినిమాలపై అవగాహన ఉన్న ఎవరినడిగినా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఎవరంటే ఠక్కున హేమామాలిని పేరు చెబుతారు. 1977లో 'డ్రీమ్ గర్ల్" సినిమా ద్వారా బాలీవుడ్‌లో లాంచ్ అయిన హేమ మాలిని తన అందం, అభినయంతో ఆ పేరును నిలబెట్టుకుంది. దాదాపు 60 ఏళ్లకు దగ్గరవుతున్న వన్నె తరగని అందంతో ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ లేడీ. ప్రస్తుతం హేమా మాలిని వయసు మీరి పోయింది. ఇప్పడు ఆమె కూతుర్లు హీరోయిన్లుగా బరిలో ఉన్నారు. మరి హేమ మాలిని తర్వాత డ్రీమ్ గర్ల్ స్థానాన్ని దక్కించుకునేది ఎవరు అనే చర్చ బాలీవుడ్లో జోరుగా సాగుతోంది.
హేమ మాలిని కుటుంబం సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం...తనకున్న 'డ్రీమ్ గర్ల్" పేరు ఏ ఇతర హీరోయిన్‌కు కూడా దక్కకుండా ప్లాన్ చేసోందట హేమా మాలిని. తన చిన్న కూతురు అహనా డియోల్ ను బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా మార్చేందుకు తెర వెనక కసరత్తు ప్రారంభించింది. తన గత సినిమా డ్రీమ్ గర్ల్ రేంజ్ లో ఓ మంచి సినిమాను అహనా కోసం ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆమెపై పబ్లిక్ కళ్లు పడి పాత బడిపోకుండా....పబ్లిక్ ఫంక్షన్ లలోకి తీసుకురావడం లేదట. హేమ మాలిని దర్శకత్వం వహించిన 'టెల్ మి ఓ ఖుదా" సినిమా ప్రమోషన్ లలో కూడా ఆమెను పాల్గొన నివ్వడం లేదు. అహనా కంటే ముందే ఎంట్రీ ఇచ్చిన పెద్ద కూతురు ఇషా హీరోయిన్ గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. మరి చిన్న కూతురైనా హేమా మాలిని పేరు నిలబెడుతుందో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











