అప్పటి పిల్లపై కన్నేసిన గుణశేఖర్
దర్శకుడు గుణ శేఖర్ ప్రస్తుతం హిట్ సినిమాలతో ఫామ్ లో లేకున్నా...సృజనాత్మకత ఉన్న దర్శకుడిగా అతనికి ప్రత్యేక స్థానం ఉంది. అతని కళ్లు ఎప్పడు టాలెంట్ కోసం వెతుకుతూనే ఉంటాయి. పొగడ్తలు పక్కన పెడితే....ప్రస్తుతం గుణ శేఖర్ కళ్లు ఓ బ్రాహ్మణ పిల్లపై పడ్డాయి. త్వరలో ఆమెను తన సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నాడటని ఫిల్మ్ నగర్ టాక్.
గుణ శేఖర్ దర్శకత్వంలో...ఆ మధ్య బాల రామాయణం సినిమా వచ్చింది గుర్తుందా? అందులో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో అదరగొడితే, సీత పాత్రలో ఓ చిన్నది ఆకట్టుంది. ఆ చిన్నదాని పేరు స్మిత మాధవ్. చైల్డ్ ఆర్టిస్టుగా అప్పడు స్మిత టాలెంట్ చూసిన గుణశేఖర్ ఎప్పటికైనా హీరోయిన్ అవుతుందని ఊహించాడు. నాలుగేళ్ల క్రితం తాను తయారు చేసుకున్న కథకు ఆమె అయితేనే కరెక్టుగా సరి పోతుందని డిసైడ్ అయ్యాడు.
స్మిత మంచి నటి మాత్రమే కాదు...క్లాసికల్ డాన్సర్ కూడా. అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని రోజుల్లో గుణశేఖర్ దర్శకత్వంలో ఆమెను తెలుగు పిల్లగా బోతున్నాం.


Click it and Unblock the Notifications











