twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుణశేఖర్ స్టోరీని పరిశీలిస్తున్న చిరంజీవి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి త్వరలో 150వ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి తనకు సూటయ్యే, అభిమానులకు నచ్చే స్టోరీ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వివిధ స్టోరీలను పరిశీలిస్తున్నారు. త్వరలో ఏదో ఒక స్టోరీ ఫైనల్ కానుంది.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి పరిశీలనలో ఉన్న స్టోరీల్లో దర్శకుడు గుణశేఖర్ రెడీ చేసిన స్టోరీ కూడా ఉందట. చిరంజీవి పార్టీ పెట్టకముందు గుణశేఖర్ ఈ స్టోరీ రెడీ చేసుకున్నారట. అయితే ఆయన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత గుణశేఖర్ వరుడు సినిమాతో బిజీ అయిపోగా, చిరంజీవి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

    Gunasekhar Story In Chiru’s List?

    అయితే అప్పుడు గుణశేఖర్ చిరంజీవి కోసం తయారు చేసిన స్టోరీ కూడా ఇప్పుడు 150 సినిమా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏ విషయం అనేది ఖరారు కానుంది. ప్రస్తుతం గుణశేఖర్ ‘రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అప్పుడెప్పుడో చిరంజీవి పుట్టినరోజు నాడే ఆయన 150వ సినిమా వివరాలు చెబుతామన్నారు. కానీ వాయిదా వేసారు. మరింత జాప్యం చేస్తూ వస్తున్నారు. ఈ జాప్యానికి కారణమేంటో తెలిసి పోయింది. ఆ మధ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేపాల్ లోని పుశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ఆలయ పండితులు ఓ విషయం సూచించారట. ఏ కొత్త ప్రాజెక్టు అయినా కార్తీక మాసం తర్వాత అంటే నవంబర్ తర్వాతే మొదలు పెట్టాలని సూచించారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందిస్తూ.....ఏ విషయమైనా నవంబర్ తర్వాత వెల్లడిస్తామన్నారు.

    English summary
    In the meantime it is coming out that Mega Star Chiranjeevi who is scouting for story for his milestone 150th film remembered about Guna’s grand plans for him. Buzz is before Chiru left Tollywood for politics, Guna penned an exciting script which Mega Star even thought of producing it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X