గుణశేఖర్ ని తెగ తిడుతోంది
దర్శకుడు గుణశేఖర్ పరచయం చేసిన హీరోయిన్ భానుశ్రీ మెహతా. అల్లు అర్జున్ తో చేసిన వరుడలో ఆమె హీరోయిన్ గా చేసింది. చిత్రం ప్రమేషన్ స్టాటజీలో భాగంగా ఆమె ఫోటోలు ఏమీ విడదల చేయకుండా సినిమా రిలీజ్ దాకా ఆమె ఎలా ఉంటుందో దాచి పెట్టి రిలీజ్ చేసారు. అయితే సినిమా విడుదలై డిజాస్టర్ కావటంతో అస్సలు ఆమె ఎవరికీ తెలియకుండా పోయింది. అంతేగాక వరుడు చిత్రం షూటింగ్ సమయంలో ఆమెను తీన్ మార్ చిత్రంలో కీర్తి కర్భందా పాత్రకు అడిగారు. అలాగే మిరపకాయలోని దీక్షా సేద్ పాత్ర కోసం కూడా ఆమెను సంప్రదించారు.
అప్పటి ఆ క్రేజ్ ఆమెకు అలా వర్కవుట్ అవుతూంటే గుణశేఖర్ అడ్డుపడి మన సినిమా రిలీజ్ అయ్యేవరకూ నువ్వు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకూడదు అని కండీషన్ పెట్టి చెడకొట్టాడు. అది అఫ్పటి కథ. ఇఫ్పుడు ఆమె గుణశేఖర్ మరో సినిమా చేస్తున్నాడు అని తెలుసుకుని ఆయన ఆఫీసుకు వెళ్లింది. అయితే గుణశేఖర్ ఆమెను చూడటానకి కూడా ఇష్టపడలేదు. ఆమె సినిమాలో ఏ సెకెండ్ హీరోయిన్ గా అయినా పాత్ర అడగొచ్చు అన్నట్లు ఎప్రోచ్ అయితే బిజిగా ఉన్నాను.. ఇప్పుడ కలవటం కుదరదని చెప్పి పంపేసాడట. దాంతో ఆమె తెగ తిట్టుకుంటూ తెలుగు పరిశ్రమలో తన పరిచయాలకు ఈ విషయం చెప్పి బాదపడిందని సమాచారం.


Click it and Unblock the Notifications











