గుంటూరు కారం దానికి కాపీనా? టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న తాజా లీక్
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపించడంతో పాటు ఈ మధ్య కాలంలో తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌లోనే తన రేంజ్‌ను పెంచుకునే భారీ సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు ఈ సూపర్ స్టార్ హీరో 'గుంటూరు కారం' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రమే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ సినిమా టాకీ పార్టును కూడా చిత్ర యూనిట్ దిగ్విజయంగా పూర్తి చేసేసుకుంది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేయాలని ప్లాన్లు చేస్తున్నారు.
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో దీని గురించి ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి రాసిన ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'గుంటూరు కారం' మూవీ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్.. యద్దనపూడి సులోచనారాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల నుంచి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, ఆ కథకు చాలా మార్పులు చేసి దీన్ని రూపొందించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు మహేశ్ అభిమానులు అందరూ ఆ నవల గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











