NBK 109 : బాలయ్య కొత్త సినిమాలో జగతి మేడం... అఖండ రేంజ్లో ఆమె పాత్ర!
జగతి మేడమ్ అలియాస్ జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈ పేరు బాగా తెలుసు. గుప్పెడంత మనసు సీరియల్‌తో ట్రెడిషనల్‌గా మంచి పాపులారిటీని తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత తన రియల్ బోల్డ్ లుక్‌ను బయట పెట్టి పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు క్రమ క్రమంగా అందరూ ఆ అందాలకు బానిసలుగా మారి వాటిని ఆస్వాదించడం కూడా మొదలెట్టేశారు. అయితే ఇప్పుడామెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. నందమూరి నట సింహం బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందని ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..
సోషల్ హాట్ నెస్ బ్యూటీ జ్యోతి రాయ్ అందాల ఆరబోతకు హద్దులే లేకుండా పోయింది. కుర్ర భామలకు పోటీగా పొట్టి పొట్టి దుస్తుల్లో కిల్లింగ్ లక్స్‌తో కుర్రాళ్ల హార్ట్ బీట్‌ను పెంచేస్తోంది. మొదట సీరియల్లో అమ్మ పాత్ర పోషించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు సినిమాల్లో సీరియల్స్‌లో మెయిన్ లీడ్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అలాగే సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేస్తోంది.

అయితే కెరీర్లో మరింత ముందుకెళ్లడం కోసం గ్లామర్ డోస్‌ను పెంచి యూత్ ఆడియెన్స్, దర్శక నిర్మాతలకు ఎర వేస్తోంది! అలా ఇప్పటికే తెలుగు చిత్రసీమలో పలు బడా ఆఫర్స్‌ను అందుకోబోతుందని వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఎన్టీఆర్ 31 సినిమాలోనూ అవకాశం దక్కిందని ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ .అమ్మడుకు మరో అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. అదే ఎన్బీకే 109 మూవీ. అఖండలో పూర్ణాది ఎంత మంచి పాత్రో తెలుసు కదా? కథకు బలమైన అలాంటి పాత్రే ఇప్పుడు దర్శకుడు బాబీ ఎన్బీకే 109లో జ్యోతి రాయ్‌కు ఇచ్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫుల్ వైరల్‌గా మారింది. ఒకవేళ ఇదే కనుక నిజమై ఆమె పాత్ర సక్సెస్ అయితే.. ఇప్పటివరకు ఆమెపై ఉన్న నెగటివ్ ప్రచారం కాస్త తగ్గుతదనే చెప్పాలి.
ఇక ఎన్బీకే 109 విషయానికొస్తే.. భగవంత్ కేసరి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా వస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. బ్లడ్ బాత్‌కు బ్రాండ్ నేమ్.. వయలెన్స్‌కు విజిటింగ్ కార్డ్ అనే క్యాప్షన్‌తో రిలీజైన పోస్టర్ ఇప్పటికే అభిమానుల్లో పూనకాలను తెప్పించింది.

సితార ఎంటర్ టైనర్ మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిత్రంలోని ఓ కీలక పాత్రలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరో కీలక పాత్రలో నటించనుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంటుందో...


Click it and Unblock the Notifications











