Nani 30: నాని మూవీకి ఊహించని టైటిల్.. స్టోరీలైన్ ఏంటో తెలిస్తే!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అంతలా అతడు దాదాపు దశాబ్దా కాలంగా సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంతేకాదు, క్రమంగా విభిన్నమైన చిత్రాలను చేస్తూ తనదైన నటనతో ప్రతి దాన్నీ వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు.
ఇలా ఈ మధ్య కాలంలోనే నాని ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు ఇటీవలే 'దసరా' అంటూ వచ్చి పాన్ ఇండియా హిట్‌ను కూడా ఖాతాలో వేసుకుని రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు.

'దసరా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని తన 30వ సినిమాను కూడా ప్రకటించాడు. శౌర్యూవ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను కూడా అప్పుడే విడుదల చేశారు. అందులో ఈ చిత్రం తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో వస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇక, ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పుడు గోవాలోని బీచ్‌లలో దీనికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21న విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో రాబోతున్న ఈ చిత్రానికి 'హాయ్ నాన్న' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రటకనతో కూడిన పోస్టర్‌ను కూడా కొద్ది రోజుల్లోనే విడుదల చేస్తారని తెలిసింది.
ఇక, విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల వల్ల వాళ్ల పిల్లలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే స్టోరీలైన్‌తో ఈ సినిమా రూపొందుతోందని కూడా ఓ న్యూస్ లీకైంది. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్ విడిపోయిన భార్యభర్తలుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది.

మంచి సందేశాత్మకమైన కాన్సెప్టుతో రాబోతున్న ఈ ఎమోషనల్ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











