ఇలియానాని దాటుతున్న హన్సిక?

ఇక హన్సిక విడుదలయినవి రెండు సినిమాలే ( కంత్రి ,దేశముదురు) గానీ పూర్తి స్ధాయి క్రేజ్ తెచ్చుకుంది. అందులోనూ ఒళ్ళు తగ్గి నాజూకుగా మారి తానూ కోటి డిమాండు చేయటం ప్రారంభిస్తోందిట. దాంతో విసుగు వచ్చిన పవన్ ఆమెను తమ 'పులి' ప్రాజెక్టు నుండి తప్పించినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇక ఆమె 55 వ ఫిల్మ్ ఫేర్ అవార్డు లలో 'బెస్ట్ డెబ్యూట్' అవార్డుని సొంతం చేసుకోవటంతో మరీ క్రేజ్ వచ్చింది. అందుకే ఆమె వరసగా తమిళ,తెలుగు,మళయాల,కన్నడ సినిమాల్లో ఆఫర్స్ సొంతం చేసుకొంటోంది.


Click it and Unblock the Notifications











